హైదరాబాద్ : తాను బతికున్నంత వరకు ఉద్యమం ఆపే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర సమతి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు అన్నారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొందరు తెలంగాణ నాయకులు స్వార్థ రాజకీయాల కోసం ఉధ్యమాన్ని మలినం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఉద్యమం ఆగిపోతే ఆంధ్రా నాయకులు బతకనివ్వరన్నారు. దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పడటం వేరని. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం వేరని కేసీఆర్ అన్నారు.




