Tuesday, 3 November 2026

బతుకమ్మ పండుగకు ప్రత్యేక టూరిజం ప్యాకేజీలు

హైదరాబాద్‌,  బతుకమ్మ పండుగకు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. పండుగ సమయంలో జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రవేశపెట్టాలని టూర్‌ ఆపరేటర్లకు సూచించారు. పండుగ రోజుల్లో డిస్కౌంట్‌తో కూడిన ప్యాకేజీలను అందించి, ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించాలన్నారు. బుధవారం బేగంపేటలో పర్యాటక భవన్‌లో టూర్‌ ఆపరేటర్లు, ఆస్పత్రుల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. బతుకమ్మ పండగు మహిళలకు సంబంధించింది కాబట్టి మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రైవేట్‌, ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేసి ఎక్కువ మంది పర్యాటకలను ఆకర్షించే విధంగా తగిన వసతులు కల్పించాలని టూరిజం, హోటళ్ల డైరెక్టర్‌ సునీతాభగవత్‌ అన్నారు. క్యాలెండర్‌ ఆఫ్‌ ఫెస్టివల్స్‌ నిర్వహిస్తూ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ టూరిజంను ప్రచారం చేయాలని శిల్పారామం ప్రత్యేకాధికారి కిషన్‌రావు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *