Tuesday, 3 November 2026

బయ్యారంపై హైకోర్టులో పిల్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): బయ్యారం గనుల ప్రాస్పెక్టింగ్‌ లైసెన్స్‌ రద్దు చేయాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలయింది. ప్రొఫెసర్‌ జేపీ రావు ఈ పిల్‌ వేశారు. రాష్రీయ ఇస్సాత్‌ నిగం కంపెనీకి5,342 చదరపు హెక్టార్లలో ఇనుప ఖనిజం కట్టబెట్టారని, ప్రభుత్వం జారీ చేసిన మెమో చెల్లదని జేపీ రావు ఇందులో పేర్కొన్నారు. పర్యావరణ, అటవీ శాఖ, ఎస్టీ నిబంధనలను కూడా ఉల్లఘిచారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహా ఏడుగురిని ప్రతివాదులుగా పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *