కామారెడ్డి ప్రతినిధి మార్చి12 (జనంసాక్షి);
పురాతన కాలంలో ఉమ్మడి కుటుంబాలతొ బలగం తోనే బలం ఉండేది, అది కాస్త రాను రాను ఉమ్మడి కుటుంబాలు తరిగిపోయి చిన్న కుటుంబాలుగా మారిపోయాయి. అయినప్పటికీ భారత సంప్రదాయం ప్రకారం ఇప్పటికీ ఉమ్మడి కుటుంబాలుగా బలగం తోనే సంబంధాలు కొనసాగుతున్నాయి, ఉన్నత చదువు లు చదువుకొని తల్లిదండ్రులను వృద్ధాశ్రమలలొ వదిలిపెట్టి వెళ్లిపోయిన వారు కొందరైతే, మరికొందరు సాంప్రదాయాలు, తల్లిదండ్రుల సేవలు మర్చిపోకుండా ఉన్నత చదువులు చదువుకున్నప్పటికీ ఉమ్మడి కుటుంబాలుగా కొనసాగుతూ తల్లితండ్రుల సేవలతో నడుచుకుంటున్నారు. తల్లిదండ్రులు చెప్పిన మాటలను జవదాటకుండా ఉమ్మడి కుటుంబాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుంది. ఇలాంటి కుటుంబాలు జిల్లాలలో చాలా కనిపిస్తాయి మనకు, కామారెడ్డి జిల్లాలో ఉమ్మడి కుటుంబాల సంప్రదాయం బలంగా ఉంది. ఉన్నత చదువులు చదువుకున్నప్పటికీ తల్లిదండ్రులను మరవకుండా, వ్యవసాయం, వ్యాపారం, రియల్ ఎస్టేట్, ఏదైనాప్పటికీ సాయంత్రం వరకు ఇంటికి చేరుకొని తల్లిదండ్రుల ఆళన పాలన చూసుకుంటున్న వారు ఉమ్మడి కుటుంబాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. బలగం అంటే కుటుంబ సమూహముని నిరూపించారు టంకరి బాగయ్య కుమారులు.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రియా 70 ఎం ఎం థియేటర్లో ఉమ్మడి కుటుంబంతో కూడిన బలగాన్ని జనం సాక్షి ప్రతినది క్లిక్ మనిపించింది
బలగం’… ఉమ్మడి కుటుంబాలు”..




