బషీర్‌బాగ్ : విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో రూపొందించిన ‘రుజువులులేని ఉద్యమం’ పుస్తకావిష్కరణను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఓయూ విద్యార్థి, తెలంగాణ న్యాయవాదుల ఐకాస ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో తెలంగాణవాదులు ప్రెస్‌క్లబ్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. పరకాల ప్రభాకర్ ప్రసంగాన్ని అడ్డుకొని పుస్తకాన్ని తగలబెట్టారు. ప్రెస్‌క్లబ్ అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో ప్రెస్‌క్లబ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అంతకుముందే పలువురిని పోలీసులు అరెస్టు చేసినప్పటికీ ఆందోళనకారులు తిరిగి ప్రెస్‌క్లబ్‌లోకి చేరుకొని నిరసన చేపట్టారు.




