Wednesday, 4 November 2026

బస్తీ ఆసుపత్రితో సుస్తీకి స్వస్తి చెప్పాలి. వైద్య సుస్తీ ఆరోగ్య శాఖ హరీష్ రావు.

నేరేడుచర్ల (జనంసాక్షి )న్యూస్.బస్తీ ఆసుపత్రితో సుస్తికి ఇక స్వస్తి చెప్పాలని బస్తీ దావఖానాలు ప్రజల ఆరోగ్యానికి దోస్తీ దావఖానాల్లో అయ్యాయాని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.శుక్రవారం నేరేడుచర్ల మున్సిపాల్టీ పరిధిలో రామాపురంలో బస్తీ దవాఖాన, మంత్రులు హరీష్ రావు,జగదీశ్వర్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు బడుగు లింగ యాదవ్, చైర్పర్సన్ దీపిక యుగంధర్,స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి,నకిరేకల్ చిరుమూర్తి లింగయ్య,లతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్బంగా మంత్రులు మాట్లాడుతు ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయ బాబు,వైస్ చైర్మన్ చల్ల శ్రీలత రెడ్డి,ఎంపీపీ జ్యోతి,మండల పార్టీ అధ్యక్షుడు అరిబండి సురేష్ బాబు, వ్యవసాయ కమిటీ ఛైర్మెన్, నాగండ్ల శ్రీధర్ బాబు,వైస్ ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ, జిల్లా వైద్య అధికారులు,హుజూర్ నగర్ ఆర్.డి.ఓ,వెంక రెడ్డి, స్థానిక మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి,తహశీల్దారు సరిత,ఎంపిడివో శంకరయ్య, గ్రంధాలయం చైర్మన్ గుర్రం మార్కండేయ, మున్సిపల్ కౌన్సిలర్స్,బిఆర్ఎస్ నాయకులు,చిత్తలూరి సైదులు, వల్లంసెట్ల రమేష్ బాబు,సత్య నారాయణ రెడ్డి,ఆకారపు వెంకటేశ్వర్లు,ఎంపిటిసిలు,సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.