Wednesday, 4 November 2026

కె యం బంజర్, మర్లకుంట గ్రామాల్లో సంబాని జోడోయాత్ర

 

పెనుబల్లి, మే26(జనం సాక్షి)
కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వ స్తేప్రతి ఏడాది జూన్ 2 నాటికి జాబ్ క్యాలెండర్ ప్రకటన చేసి, సెప్టెంబర్ 17 లోపు నియామకాలు భర్తీ చేయడం జరుగుతుందని టి పి సి సి సీనియర్ ఉపాధ్యక్షులు, మాజీమంత్రి సంభాని చద్రశే ఖర్ అన్నారు,49వ రోజు హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా శుక్రవారం పెనుబల్లి మండల పరిధిలోని కందిమల్లయ్య బంజర్, మర్లకుంటగ్రామాల్లో జొడో యాత్ర నిర్వహించారు, ఈ సంధర్భంగా ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు,కార్యక్రమంలోసంబాని మాట్లాడుతూయువత భవిత, అమరుల ఆశయ సాధనే కాంగ్రెస్ విధానమన్నా రు, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులకు అండగా ఉండేందుకే యూత్ డిక్లరేషన్ రూపొందించామని అన్నారు,
మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ,మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ చేస్తామన్నారు,ప్రతీ ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాల పూర్తిచేస్తామన్నారు,విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు యూత్ కమిషన్‌ను ఏర్పాటు చేసి,రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపా యం కల్పిస్తామన్నారు,
ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేట్ కంపెనీల్లో తెలంగాణ యువతకు 75% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు,
నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతీ నెలా రూ. 4000 నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు,ప్రత్యేక చట్టంతో టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో పునరుద్ధరణచేస్తామన్నారు,
18 ఏళ్లు పైబడిన బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు పంపిణి చేస్తామన్నారు,
ప్రతి జిల్లాలో అన్ని వసతులతో కూడిన ప్రపంచస్థాయి క్రీడా విశ్వవిద్యాలయాలు ఏర్పాటుచేస్తామన్నారు,
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెలికాని రాజబాబు ఆధ్వర్యంలో జరిగిన
ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు బైరెడ్డి మనోహర్ రెడ్డి, స్టేట్ ఎస్ సి, డి పి టి కన్వీనర్ కొండూరు కిరణ్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వడ్లమూడి కృష్ణయ్య, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామిశెట్టి మనోహర్ నాయుడు, కాంగ్రెస్ నాయకులు చింతల దేవేంద్రబాబు, నున్నా సురేష్, భోగి నరసింహారావు, బొప్పన మోహన్ రావు, మేకతోట్టి కాంతయ్య, గోగినేని రమేష్, బల్లి కాసులు, భూక్యా కృష్ణ, పకీర్ సాహెబ్, బెల్లంకొండ సీతారాములు, బొర్రా రవి, మందా రాఘవ, కర్రి వెంకటాద్రి, వేమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, జొన్నలగడ్డ కృష్ణ, పుట్టా మారేశ్ తదితరులుపాల్గొన్నారు.