హైదరాబాద్: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబీకులకు సమాచారం చేరవేసి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.