బహుజన రాజ్యం లోనే బతుకులు మారేది బీఎస్పీ అలంపూర్ ఇంచార్జ్ మహేష్ అలంపూర్ జనంసాక్షి (అక్టోబర్ 29) బహుజన బతుకులలో వెలుగు నింపాలంటే అది బీఎస్పీ తోనే సాధ్యమని, బహుజన రాజ్యంలోనే బతుకులు మారుతాయి అని అలంపూర్ బిఎస్పి ఇంచార్జ్ మహేష్ అన్నారు.శనివారం అలంపూర్ పట్టణం నుండి
మునుగోడు లోని సంస్థాన్ నారాయణ్ పూర్ లో జరిగే బహుజనుల ఆత్మగౌరవ సభకు అలంపూర్ నియోజకవర్గం అధ్యక్షుడు బి.మహేష్ ఆధ్వర్యంలో భారీగా బీఎస్పీనాయకులు,కార్య ర్తలు బయలు దేరివెళ్లారు. ముందుగా పట్టణం లోని అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసినివాళులు అర్పించారు.అనంతరం మహేష్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా బహుజనులకుఅవకాశాలు కల్పించకుండా కేవలం కుటుంబ పాలన మాదిరిగా ఒకే వర్గపు వారు ఈ మునుగోడు గడ్డను,పాలిస్తున్నారన్నారు. ఈసారి మునుగోడు గడ్డ బహుజనుల అడ్డా అని నిరూపించడానికి తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున బహుజన నాయకులు, కార్యకర్తలు హాజరు అవుతారు అన్నారు. అలంపూర్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బీఎస్పీనాయకులు పాల్గొని జరగబోయే సభను విజయవంతం చేద్దాం అన్నారు.ఈసభ ద్వారా అగ్రకుల పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా ఈ ర్యాలీ మరియు సభ ఉండబోతుందనిఅన్నారు అలంపూర్ నియోజకవర్గం నుండి బీఎస్పి అలంపూర్ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు యామని సుంకన్న, ఉండవళ్లి ప్రభుదాస్,నాయకులు,మారెన్న,మద్దిలేటి,కరుణాకర్,బాస్కర్,మళ్లీ,సూరి,సువార్తన్న వాల్మీకి రంగస్వామి,రాజు,గౌడ జయ రాముడు,ఆటో స్వాములు,రవీందర్,డి నాగరాజు, డి ప్రకాశం, కే జయన్న, ఆర్ అబ్రహం తో పాటు, పెద్ద ఎత్తున కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు.
బహుజన రాజ్యం లోనే బతుకులు మారేది బీఎస్పీ అలంపూర్ ఇంచార్జ్ మహేష్ అలంపూర్ జనంసాక్షి (అక్టోబర్




