Wednesday, 4 November 2026

ఆధార్ కార్డులను నవీకరణ చేసుకోవాలి

ఆధార్ కార్డులను నవీకరణ చేసుకోవాలి
రేగోడ్/ జనం సాక్షి అక్టోబర్:
ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవాలని ఆధార్ సెంటర్ నిర్వాహకుడు వడ్ల సంతోష్ కుమార్ అన్నారు. రేగోడ్ మండలంలోని 2010 నుండి 2015 వరకు ఆధార్ కార్డు కలిగిన వారు. ఆధార్ కార్డు వివరాలను తప్పకుండా సరిచూసుకొని నవీకరణ చేసుకోవాలని వారు తెలిపారు.మండల కేంద్రమైన రేగోడ్ ఎంపీడీవో కార్యాలయంలో ఆధార్ కేంద్రం అందుబాటులో ఉందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి నవీకరణ చేసుకోవాలన్నారు.