Wednesday, 4 November 2026

బాంబు ఉందంటూ ఫోన్‌ చేసిన మహిళపై కేసు

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్‌ చేసిన ఓ మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న అర్థరాత్రి ఓ మహిళ విమానాశ్రయంలో బాంబు ఉందంటూ ఫోన్‌ చేసింది. కాసేపటి తర్వాత బాంబు లేదంటూ మరోసారి ఫోన్‌ చేసింది. దీంతో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు మహిళపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *