హైదరాబాద్: శంషాబాద్ మండలం తొండుపల్లిలో అక్రమంగా లారీలో తరలిస్తున్న 270 బస్తాల చౌక బియ్యాన్ని విజెలెన్స్ అధికారులు పట్టుకున్నారు. వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. మరో ఘటనలో నల్గొండ జిల్లా కోదాడ మండలం కోమరబండ వద్ద 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.




