హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల ఘటనలో మృతిచెందిన కుటుంబసభ్యులకు ఉద్యోగం కల్పిస్తామంటూ ఇచ్చిన హామీని ప్రభుత్వం ఆచరణలోకి తెచ్చింది. బాంబు పేలుళ్లలో మృతి చెందిన వెంకటేశ్ భార్య సుజాతకు పశుసంవర్థక శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మృతుల కుటుంబాలకు ఉద్యోగం ఇస్తామన్న ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి తొలి నియామకపత్రం సుజాతకు అందజేశారు.




