Wednesday, 4 November 2026

బాధితురాలికి చంచల్ గూడ ఎస్పి ఆర్థిక సాయం

 

 

 

 

 

 

 

 

జుక్కల్, ఎప్రిల్ 9, (జనంసాక్షి),సంగారెడ్డి జిల్లా కoగ్టి మండల కేంద్రానికి చెందిన మచ్కురి సురేఖ (20) అనే బాధితురాలికి చంచల్ గూడ సెంట్రల్ జై ల్ ఎస్పి నవాబ్ శివకుమార్ గౌడ్ ఆదివారం పోన్ పే ద్వారా పదివేల రూపాయల ఆర్థిక సాయం చేశారు.ఈ ఎస్పి కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లo మండల కేంద్రానికి చెందినవారు. మచ్కురి సురేఖ తలలో ట్యూమర్ వ్యాధితో బాధ పడుతోంది. ఆమెకు శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలిపారు.ఈ చికిత్సకు ఆరులక్షల రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. సురేఖ తండ్రి చిన్ననాడే చనిపోయాడు.ఆమెకు తల్లి ఇద్దరు,అక్కలు ఉన్నారు.
తల్లి చంద్రమ్మ కూలి నాలి చేసి ఇద్దరు కూతుళ్ల పెళ్ళిళ్ళు చేసింది. ప్రస్తుతం చంద్రమ్మ, చిన్న కూతురు సురేఖ ఒక అద్దె ఇంటిలో ఉంటున్నారు. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. ఉన్నట్టుండి సురేఖ ఇంట్లో పనులు చేస్తుండగా తలతిరిగి కింద పడిపోయింది. ఆమెను నిజామాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమెకు తలలో ట్యూమర్ ఉందని, చీము కూడా పట్టిందని, తొందరగా ఆపరేషన్ చేయాలని తెలిపారు. ఎలాంటి ఆదారంలేని ఆమె జర్నలిస్టులను ఆశ్రయించగా ఆమె దయనీయ స్థితిని పత్రికల్లోప్రచురించారు. ఆమెను ఆదుకోవాలని కోరారు. ఆర్థిక సాయం చేయదలచిన వారు ఆమె బంధువుకు పోన్ పే( 9701636236 ) చేయాలని కోరారు. ప్రస్తుతం ఈమె హైద్రాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.