Wednesday, 4 November 2026

తులసి రమణా చార్యుల కు ఉగాది పురస్కారం.

 

 

 

 

మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్ 9మానవ సేవయే మాధవ సేవ గా భావించి నిత్యం మాధవ సేవ చేస్తూ సమాజ చైతన్యం కోసం సామాజిక సాంస్కృతిక సాహిత్య ఆధ్యాత్మిక సేవా రంగాల్లో కృషి చేస్తున్న అక్షర కౌముది సంస్థ అధ్యక్షులు యువ కవి రచయిత అర్చకులు తులసి వెంకట రమణా చార్యులు కృషి ని గుర్తించి విశ్వ భారతి మ్యాక్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ మరియు తెలుగు భాషా చైతన్య సమితి సంయుక్త ఆధ్వర్యంలో తులసి వెంకట రమణా చార్యుల కు ఉగాది పురస్కారం అందించారు. ఈసందర్భంగా పురస్కార గ్రహీత తులసి వెంకట రమణా చార్యులు మాట్లాడుతూ.భగవంతుని అనుగ్రహం వల్ల తల్లి తండ్రుల దీవెన వల్ల ఈరోజు ఇలాంటి పనులు చేసే అవకాశం వచ్చింది.సమాజం కోసం ఎదో ఒకటి చెయ్యాలి అనే సంకల్పంతో అక్షర కౌముది సంస్థ ను స్థాపించి వివిధ రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.ఈ అవార్డు వల్ల ఇంకా నాపై ఎంతో భాద్యత పెరిగిందని అన్నారు.అందరి సహాయ సహకారాల వల్ల మరెన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తానని తెలిపారు.