బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన బి. ఆర్.ఎస్ నాయకుడు పగడాల సైదులు
మండల కేంద్రానికి చెందిన పగిడిమర్రి సైదయ్య కుమారుడు పగిడిమర్రి వెంకటేశ్వర్లు ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా , విషయం తెలుసుకున్న భారతీయ రాష్ట్ర సమితి నాయకులు పగడాల సైదులు యాదవ్ మృతుని కుటుంబ తల్లిదండ్రులను ఓదార్చి వారికి తనవంతుగా 10000 ఆర్థిక సహాయం అందించారు. యువత ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలించవద్దని ఆయన యువతకు సూచించారు. కార్యక్రమంలో ఆయన వెంట విద్యా కమిటీ చైర్మన్ ఇరిగి. నాగయ్య , ఇరిగి. శ్రీను , అనుముల శ్రీను, హమాలి కార్మికులు శ్రీను, కొచ్చర్ల కోటేష్, పిట్టల కొండల్, అనుముల చిన్ని, అనుముల ఏసు, ఇరిగి శ్రీను, కూరాకుల మహేందర్, అనుముల. మింటు తదితరులు పాల్గొన్నారు.