Thursday, 5 November 2026

బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం కెఎస్అర్ ట్రస్ట్

దోమ జనవరి 22(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని మోత్కూరు గ్రామానికి చెందిన అలిబాబా గుండెపోటుతో మరణించారు..
ఈయన వారు ఇంటి మనిషిగా వారి కుటుంబానికి ఎన్నో సేవలు చేశారు అందుకు గాను కెఎస్అర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు రాజేశ్వరమ్మ వారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, మీ కుటుంబానికి ఏళ్ళప్పుడు అన్ని వేళలా ఉన్నాము ,ఇక మీదట కూడా మేము అండగా ఉంటామని భరోసాను ఇస్తూ వారి కుటుంబానికి మనోధైర్యన్ని నింపుతూ 10,000/- వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు.