బాధిత కుటుంబానికి బియ్యం పంపణీ చేసిన బీ ఆర్ ఎస్ నాయకులు
జనం సాక్షి, చెన్నరావు పేట
మండలంలోని కోనాపురం గ్రామానికి చెందిన ముంజల రాజమ్మ కుమారుడు రమేష్ గత పది రోజుల క్రితం నర్సంపేటలో కరెంట్ షాక్ గురై మరణించడం జరిగింది.నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు 50 కిలోల బియ్యం వారికి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెల్దే సుజాత సారంగం, ఎంపీటీసీ గుండాల మహేందర్, కోనాపురం గ్రామ పార్టీ అధ్యక్షులు దొంగల రాజకుమార్, ఇందూరు నర్సిరెడ్డి, చిలువేరు రంగారావు, పసునూరి నవీన్, కంచు హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.