Friday, 6 November 2026

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

కొడకండ్ల, మార్చి17(జనం సాక్షి):
హనుమకొండ లోని సువిద్య ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతూ,ఆత్మహత్య కు పాల్పడిన జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామానికి చెందిన మురారి శెట్టి నాగజ్యోతి కుటుంబాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించి, ఆమె చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు. అనంతరం ఆమె మృతికి దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆమె తండ్రి మురారి శెట్టి సమ్మయ్య, తల్లిని, కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.