హైదరాబాద్ మార్చి 19(జనంసాక్షి):
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కార్యవర్గం శనివారం బాధ్యతలు చేపట్టింది. ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో ఫలితాలను అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల రిట్నర్నింగ్ అధికారి హేమసుందర్ గుండె సంబంధ వ్యాధితో ఆస్పత్రి పాలు కాగా, ఎన్నికల ప్రక్రియను మరో రిటర్నింగ్ అధికారి రంగాచార్యులు ఆధ్వర్యంలో చేపట్టి ముగించారు. క్లబ్ అధ్యక్షులుగా ఎల్. వేణుగోపాల నాయుడు, ప్రధాన కార్యదర్శిగా రవికాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా సి.వనజ, కె.శ్రీకాంతరావు, సహాయ కార్యదర్శులుగా రమేష్ వైట్ల,చిలుకూరి హరిప్రసాద్, కోశాధికారిగా ఎ.రాజేష్ లతో పాటు మరో పది మంది కార్యవర్గ సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టారు.




