Thursday, 5 November 2026

బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అధికారికంగా జరపాలి.

 

 

 

 

 

 

 

 

వికారాబాద్ రూరల్ ఏప్రిల్ 12:(జనం సాక్షి)ప్రపంచ మేధావి, మానవహక్కుల ప్రధాత, భారతరత్న , భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలను వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా అధికారికంగా జరిపించాలి మరియు ఆయా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో విగ్రహాలకు రంగులు వేయించి జయంతి కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని వికారాబాద్ జిల్లా మాల మహానాడు అధ్యక్షులు బి గాలయ్య తెలిపారు మరియు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన125 అడుగుల బాబా సాహెబ్ అంబేద్కర్ అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయం అన్నారు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడి ఒడ్డున ఏర్పాటు చేసి ఈ సంవత్సరం 132వ డా. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆవిష్కరణ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కు మాల మహానాడు తరఫున తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు