హైదరాబాద్: అధికారంలోకి వస్తామని పగటి కలలు కనటం చంద్రబాబు కోత్తకాదని మంత్రి వట్టి వసంత్ కుమార్ ఎద్దేవా చేశారు.2009 సంవత్సరంలో మొదటి దశ పోలింగ్ ముగిశాక టీడీపీ ఇంతకన్నా ఎక్కువ సంబరాలు చేసుకుందని ఆయన గుర్తు చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తామని అధికారులను,పారిశ్రమిక వేత్తలను పిలిచి బెదిరించారని వట్టి వసంత్ కుమార్ మంగళవారమిక్కడ అన్నారు. ఆల్ ఫ్రీ బాబు నకిలీ డెబిట్ కార్డుకూడా పంచారని ఆయన విమర్శించారు.




