‘బాబు’ను పట్టుకుంటే లక్ష ఇస్తా!

– రామ్‌ గోపాల్‌ వర్మ బంపర్‌ ఆఫర్‌
న్యూఢిల్లీ, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : ‘బాబు’ను పట్టివ్వటం ఏమిటి.. లక్ష ఇవ్వటం ఏమిటి.. రామ్‌గోపాల్‌ వర్మకు పిచ్చి పీక్‌స్టేజికి వెళ్లిందా..! అని అనుకుంటున్నారా.. బాబు అంటే ఇక్కడ చంద్రబాబు కాదండీ బాబు.. అచ్చం చంద్రబాబును పోలిఉన్న మరోమనిషి..!! విూరు వింటుంది నిజమే.. మనుషులను పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని అంటుంటారు. అనడమే కానీ అలా ఉన్నారని గుర్తించడం చాలా కష్టం. ఒకవేళ ఉన్నా అలాంటి వ్యక్తులను కనుక్కోవడం చాల కష్టం. సినిమాల్లో చూడటమే తప్ప బయట చూడలేము. ఇప్పుడు అలాంటి వ్యక్తుల కోసం అన్వేషణ జరుగుతుంది. గతంలో ప్రధాని నరేంద్ర మోడీని పోలిన వ్యక్తిని నార్త్‌ ఇండియాలో ఉన్నాడని ఫోటోలు వచ్చాయి. ఆ వ్యక్తి బాగా పాపులర్‌ అయ్యాడు. ఇప్పుడు అలాంటి న్యూస్‌ ఒకటి ట్విట్టర్‌ లో ట్రెండ్‌ అవుతున్నది. చంద్రబాబును పోలిన వ్యక్తి ఒకరు ఉన్నారని సోషల్‌ విూడియాలో ట్రెండ్‌ అవుతున్నది.  ఓ ¬టల్‌ లో సర్వర్‌ గా పనిచేస్తున్న వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ విూడియాలో పోస్ట్‌ అయింది.  క్షణాల్లో ఆ వీడియో వైరల్‌ అయింది.  ఈ విషయం తెలుసుకున్న వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ.. ఆ వ్యక్తికి సంబంధించిన ఆచూకీని మెయిల్‌ ద్వారా తెలియజేయాలని.. అలా సమాచారం చెప్పిన మొదటి వ్యక్తికి లక్ష రూపాయల బహుమానం ఇస్తానని పేర్కొన్నాడు. రామ్‌ గోపాల్‌ వర్మ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ అనే సినిమాను తీయబోతున్న సంగతి తెలిసిందే.  లక్ష్మిపార్వతి కోణంలో ఎన్టీఆర్‌ ఎలా ఉన్నాడు.. ఎలాంటి వ్యక్తి అనే విషయాల చుట్టూ సినిమా ఉండబోతుంది. ఇందులో చంద్రబాబు రోల్‌ తప్పకుండా ఉంటుంది.. సోషల్‌ విూడియాలో పోస్ట్‌ అయిన వీడియోలో ఆ వ్యక్తి అచ్చంగా చంద్రబాబులా ఉండటంతో.. ఆ వ్యక్తికోసం రామ్‌ గోపాల్‌ వర్మ  ఇలాంటి ఆఫర్‌ ను ప్రకటించాడు.