హైదరాబాద్,(జనంసాక్షి):టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పై మంత్రి దానం నాగేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పద అన్నారు. పాదయాత్రలో ప్రజాసమస్యలు వినేందుకు 4 నిమిషాల సమయం కూడా కేటాయించలేదని చెప్పారు. చార్‌థామ్ యాత్రికుల సహాయ కార్యక్రమాలపై బాబుది అనవసర రాద్దాంతం అన్నారు. రాష్ట్రాన్ని కించపర్చేలా మాట్లాడుతూ చంద్రబాబు మోడీకి సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పారు. చంద్రబాబు డ్రామాలు మాని మానవతా ధృక్పథంతో వ్యవహరించాలని సలహా ఇచ్చారు. అక్కడి వాతాంరణం అనుకూలించక సీఎం కిరణ్ ఉత్తరాఖండ్ వెళ్లలేదన్నారు. ఉత్తరాఖండ్ పరిస్థితులను మంత్రుల ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షించారని చెప్పారు. రాష్ట్రానికి చెందిన ఉత్తరాఖండ్ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.




