– శివాజిని పోలీసులు ఎందుకు విచారించడం లేదు
– వైసీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి
హైదరాబాద్, నవంబర్6(జనంసాక్షి) : ఏపీలో సీఎం చంద్రబాబు పాలన నరకాసురుడిని తలిపిస్తుందని వైసీపీ నేత ఆనం రామనారాయణ అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు..
నాడు ప్రజలను నరకాసురుడు ఇబ్బంది పెడితే నేడు ఏపీ ప్రజలను నారాసురుడు ఇబ్బందులు పెడుతున్నాడని విమర్శించారు. బెల్ట్ షాపులు తీసెయ్యలేదని, ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగితే పట్టించుకోలేదని, అవినీతి పెరిగిందని, ఇసుకాసురులు పెరిగిపోయారని ధ్వజమెత్తారు. 2019 ఎన్నికల్లో నారాసురుడి రాజకీయ సంహారంతోనే ఏపీ ప్రజలకు నిజమైన దీపావళి వస్తుందన్నారు. హుదూద్, తిత్లీ తుఫాన్‌లతో చంద్రబాబు లబ్దిపొందుతున్నారని ఆరోపించారు. తుఫాన్ బాధితులకు ఎదో సాయం చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈనాలుగేళ్లలో రాష్ట్రంలోని అన్ని వ్యవవస్థలు దిగజారిపోయాయన్నారు. ఆపరేషన్ గరుడ అని చెప్పిన వ్యక్తిని ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. పోలీస్ శాఖలు ఎక్కడ పనిచేస్తున్నాయని, ఇంటలిజెన్స్ శాఖ పక్క రాష్ట్రంలో ఓట్లు కొనుగోలు చేయడం ఏంటని నిలదీశారు. యూపీఎలో చంద్రబాబు కొత్తగా కూడగట్టేదేముందని, ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిన చంద్రబాబు రాజకీయ వ్యవస్థను కూల్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఒకటిన్నర లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారని, ఆర్థికంగా చంద్రబాబు, ఆయన కుటుంబం మాత్రమే లాభపడిందని ఆరోపించారు. చంద్రబాబు తీరు గురవింద సామెతను తలపిస్తుందని విమర్శించారు.
బాబు పాలన నరకాసురుడిని తలిపిస్తుంది




