హైదరాబాద్ (మార్చి 04): ఏపీ సిఎం చంద్రబాబు కరీంనగర్ పర్యటనను బ్లాక్‌డేగా పరిగణిస్తున్నామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రైతాంగానికి చంద్రబాబు చేసిందేమీ లేదని, బాబ్లీ ప్రాజెక్ట్‌పై పోరాటమంటూ మహారాష్ట్ర సర్కారుతో వివాదం తీసుకొచ్చారని ఆరోపించారు. బాబు ఉమ్మడి రాష్ట్ర సిఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ను అభివృద్ధి చెయ్యలేదని, రాజధానిని గుడిసెల నగరంగా మార్చారని తీవ్ర విమర్శలు చేశారు.
చంద్రబాబు కరీంనగర్ పర్యటనపై రసమయి బాలకిషన్ స్పందిస్తూ తాము తలుచుకుంటే కరీంనగర్ నుంచి చంద్రబాబు తిరిగి వచ్చేవారు కాదనన్నారు. తెలంగాణ గడ్డపై విచక్షణారహితంగా మాట్లాడితే ఆయన్ని ఇంటి గడప తొక్కకుండా చేస్తామని హెచ్చరించారు.




