హైదరాబాద్: మహారాష్ట్ర చేపట్టిన బాబ్లీ ప్రాజెక్టును అడ్డుకోవడంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి నిర్లక్ష్యం వహించారని కాంగ్రెస్ ఎంపీ మధుయాస్కీ గౌడ్ ఆరోపించారు. బాబ్లీ ప్రాజెక్టు పనులు దక్కించుకుంది సొంత కాంట్రాక్టర్లు కావడంతో ప్రాజెక్టును వైఎస్ అడ్డుకోలేదని ఆయన విమర్శించారు. బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు తీర్పు బాగుందన్నారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే తెదేపా, తెరాసలు బాబ్లీ ప్రాజెక్టుపై రాద్దాంతం చేస్తున్నాయని ఆరోపించారు.




