హైదరాబాద్,మార్చి3(జనంసాక్షి): బాలయోగి దేశానికి చేసిన సేవలు మరువలేనివని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన ఎంతో ఉన్నత రాజకీయ విలువలను నెలకొల్పారని అన్నారు. దివంగత లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి వర్థంతి సందర్భంగా ఎన్టీర్ ట్టస్ర్‌భవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం బాలయోగి చేసిన సేవలు అభినందనీయమని కొనియడారు. బాలయోగి స్ఫూర్తితో కార్యకర్తలు ముందుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో తెదేపా కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయ కర్త నారా లోకేష్, సీనియర్ నేతలు రేవంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




