Tuesday, 3 November 2026

ప్రజల్లో సహనం నశిస్తే ఉద్యమిస్తారు: జేసీ

అనంతపురం,మార్చి3(జ‌నంసాక్షి):ఏపీకి సాయం విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రాష్ట్రం బిహార్‌ కంటే దారుణంగా తయారవుతుందని అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజల్లో సహనం నశిస్తే తిరగబడి ఉద్యమం చేస్తారని ఆయన అనంతపురంలో హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయించడాన్ని చూస్తే ఆ ప్రాజెక్టు పూర్తికాదనేది స్పష్టమవుతోందన్నారు. అందుకే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేసి గోదావరి జలాల్ని కృష్ణా డెల్టాకు, కృష్ణాజలాల్ని రాయలసీమకు ఇవ్వాలన్నారు. హంద్రీనీవా కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *