Wednesday, 4 November 2026

బాలాపూర్‌లో ఐదుగురికి డెంగీ

పహాడిషరీఫ్‌ : బాలాపూర్‌ గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతో దోమలు వృద్ధి చెంది కాటు వేయడం వల్ల డెంగీ వ్యాధితో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. బాలాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని న్యూ బాబానగర్‌ గల్లీ నంబర్‌ 8లో ఓ డైరీఫామ్‌, రెండు స్ర్కాప్‌ గోదాములు ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాల వల్ల అక్కడ నీరు నిలవడంతో దోమలు వృద్ధి చెందాయి. ఆ బస్తీ ప్రజలు విషజ్వరాల బారిన పడి వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతుండగా షేక్‌ అద్నాన్‌(21) అనే యువకుడు డెంగీతో 11 రోజులుగా చికిత్స పొందుతుండగా నుద్రత్‌ ఫాతిమా(18), నుస్రత్‌ ఫాతిమా(19), నాజ్నిన్‌ పర్వీన్‌(17), అర్షిన్‌ ఫాతిమా(8) చాంద్రాయణగుట్టలోని బీబీ అమీనా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ బస్తీలో ఉంటున్న ఓ మీడియా ప్రతినిఽధి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో గ్రేటర్‌ ఎంటమాలజీ విభాగం అధికారుల ఆదేశాల మేరకు బుధవారం ఉదయం న్యూ బాబానగర్‌ బస్తీలో యాంటీ లార్వా ఆపరేషన్‌, ఇండోర్‌ రెసిడియల్‌ స్పేర్‌, మాలదిన్‌, పైరాడ్రమాస్ర్పేను డెంగీ సోకిన పరిసరాల్లో నిర్వహించినట్లు ఎంటమాలజీ సిబ్బంది తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *