Tuesday, 3 November 2026

బాలిక నిశ్చితార్థాన్ని అడ్డుకున్న అధికారులు..

హైదరాబాద్ : ముక్కు పచ్చలారని కూతురును పెళ్లిచేసి వదిలించుకోవాలని చూసింది కన్నతల్లి. ఈ ఘటన హైదరాబాద్‌ బంజారాహిల్స్ లో చోటుచేసుకుంది. శ్రీరాంనగర్‌లో నివాసముంటున్న 13 ఏళ్ల బాలికకు మే 11న పెళ్లి చేసేందుకు తల్లి ఏర్పాట్లు చేసింది. కుటుంబ పెద్దలు, బంధువుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకుంటున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు వారిని పట్టుకున్నారు. తమదైన శైలిలో బాలిక తల్లి, బంధువులకు కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెట్టారు. మైనర్ బాలికను పెళ్లి చేయాలనుకోవడం చట్టరీత్యా నేరమని.. కాదని చేస్తే మూడేళ్ల పాటు జైలు శిక్ష తప్పదని హైచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *