Tuesday, 3 November 2026

నేపాల్‌లో ‘ఎటకారం’ సినిమా నటుడు విజయ్‌ మృతి

 ఖాట్మాండు: నేపాల్‌లో భూకంపం కారణంగా ఓ సినీ నటుడు ప్రాణాలు కోల్పోయాడు. షూటింగ్‌కోసం నేపాల్‌ వెళ్లిన ఎటకారం చిత్ర బృందం కారు.. ఇవాళ ఉదయం వచ్చిన భూకంపం ధాటికి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నటుడు, నృత్య దర్శకుడు విజయ్‌ ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన విజయ్‌.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డట్టు సమాచారం. విజయ్ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *