పెన్ పహాడ్. మార్చి 06 (జనం సాక్షి) :మండల పరిధిలోని అనంతారం గ్రామంలో రామాలయం దేవాలయం లో అనాధ బాలిక అంతేన పూజకు గ్రామానికి చెందిన బైరెడ్డి విజయమ్మ నాగార్జున్‌రెడ్డి దంపతుల చేతుల మీదుగా వారి కుమారుడు బైరెడ్డి వివేక్ రెడ్డి, కూతురు బైరెడ్డి సుష్మా రెడ్డి సహాయ సహకారంతో సోమవారం రూ.40 వేల రూపాయల చెక్కు అందించడం ఇవ్వడం జరిగింది ఈ సహకారంతో అంతేన పూజ చదువులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వారు కోరారు . ఈకార్యక్రమంలో సర్పంచ్ బైరెడ్డి శ్రీనివాసరెడ్డి రామాలయం పూజారి నాగరాజుశర్మ,ఎంపిటిసి మామిడి రేవతి పరందాములు, ఉపసర్పంచ్ మామిడి మైసయ్య,వార్డు సభ్యులు నాగార్జున. ,బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఒంటెద్దుఆదర్శ్ రెడ్డి, సామనరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు…




