Tuesday, 3 November 2026

బాలుడికి మద్యం తాగించిన ఘటనలో ఇద్దరు అరెస్టు

child Forced to Drink Liquor By Uncle,

తమిళనాడు: తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో బాలుడి(4)కి బలవంతంగా మద్యం తాగించిన ఘటనలో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితులైన మరో నలుగురి వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు వివరాలిలా ఉన్నాయి. రెండు వారాల క్రితం బాలుడి అంకుల్ కొంతమంది వ్యక్తులతో కలిసి మద్యం తాగుతున్నాడు. ఆ సమయంలో బాలుడిని దగ్గరగా తీసుకుని బలవంతంగా మద్యం తాగించారు. దీనినంతటిని వీడియోగా తీశారు.

వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియోలో గుర్తించిన వారిలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరో నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులుపై జువైనల్, మర్డర్ కేసులను నమోదు చేశారు. చిత్రీకరణకు ఉపయోగించిన కెమెరాను, సంఘటనా స్థలంలో ఉన్న ఓ మోటార్ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలుడు ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *