ప్రయాణికులు సురక్షితం
కాచిగూడ(హైదరాబాద్): ఉప్పల్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికుల కథనం ప్రకారం… ఉప్పల్ నుంచి మెహదీపట్నం వెళ్తున్న బస్సు బర్కత్‌పుర కూడలి వద్దకు రాగానే ఇంజన్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను దించేశారు. ఇంజన్ నుంచి ఆయిల్ లీకవడంతో మంటలు చెలరేగాయి. స్థానికులు మట్టి, నీళ్లు చల్లి మంటలను ఆర్పివేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులతో బస్సు కిక్కిరిసి ఉంది. ప్రమాదం నుంచి ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ వూపిరి పీల్చుకున్నారు.
బర్కత్‌పుర వద్ద ఆర్టీసీ బస్సులో మంటలు




