Monday, 2 November 2026

బాలుర వసతి గృహాన్ని సందర్శించిన తీన్మార్ మల్లన్న  టీం

-విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వార్డెన్ను తొలగించాలి
-బాలుర హాస్టల్లో లైట్లు త్రాగునీరు ఏర్పాటు చేయాలని డిమాండ్
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా అధ్యక్షులు గణపురం శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి పవన్
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించిన తీన్మార్ మల్లన్న టీం అక్కడ ఉన్న అన్ని వసతులను పరిశీలించి విద్యార్థులు ఉదయం పాల కోసం కిలోమీటర్ నడవాలని,రూములలో లైట్లు త్రాగడానికి మంచినీళ్లు లేవని, వార్టన్ అసలు హాస్టల్లో  ఉండడనే విషయాన్ని తెలుసుకున్న తీన్మార్ మల్లన్న టీం హాస్టల్ వార్డన్తో ఫోన్లో మాట్లాడి అన్ని వసతులు కల్పించవలసిన అవసరం ఉందని లేనిపక్షంలో తమరిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.అనంతరం విద్యార్థుల తో కలిసి భోజనం చేసి , 7200,విద్య వైద్యం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించి మధ్యతరగతి వారికి ఉచిత విద్య,ఉచిత వైద్యం,సత్వర న్యాయం లక్ష్యంగా తీన్మార్ మల్లన్న టీం పన చేస్తుందని తెలియజేసారు.విద్యార్థుల తల్లిదండ్రులు కడుతున్న పన్నులు ద్వారానే ప్రభుత్వ హాస్టల్స్ నడుస్తున్నాయని గుర్తు చేస్తూ న