Monday, 2 November 2026

గిరిజన సంఘ బహిరంగ సభను జయప్రదం చేయండి… ఏర్పాటను పరిశీలించిన జూలకంటి

ఏర్పాటను పరిశీలించిన జూలకంటి
మిర్యాలగూడ, జనం సాక్షి.
మార్చి 1న మధ్యాహ్నం రెండు గంటలకు మిర్యాలగూడలోని ఎన్ఎస్పీ క్యాంపులో జరిగే గిరిజన సంఘం బహిరంగ సభను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. మంగళవారం స్థానిక ఎన్ఎస్పి క్యాంపులు బహిరంగ సభ స్థలాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి ఒకటి రెండు మూడు తేదీలలో మిర్యాలగూడలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మూడవ మహాసభలు జరుగుతున్నాయని అందులో భాగంగా మార్చి 1న మహా ప్రదర్శన, బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్థానిక హనుమాన్ పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి ఎన్ఎస్పి క్యాంపు మైదానం వరకు మహా ప్రదర్శన జరుగుతుందని ఈ ప్రదర్శనలో సుమారు 2000 మంది యువతీ యువకులు కవాతు నిర్వహిస్తారని చెప్పారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఎన్ఎస్పి క్యాంపు మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని జిల్లా నలుమూలలతోపాటు ఇతర జిల్లాల నుండి గిరిజనులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు వేలాదిగా తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ నాయక్ జిల్లా అధ్యక్షులు మూడవత్ రవి నాయక్,బాబు నాయక్, నాగేశ్వర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.