బాల్కొండ ఏప్రిల్ 26 (జనం సాక్షి ) తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ అధ్యక్షుడు అబ్బగోని అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో చలో బాల్కొండ అనే నినాదంతో బాల్కొండ నియోజకవర్గంలో బాల్కొండ మండల కేంద్రంలోని ఎంకే గార్డెన్ లో బీసీల భారీ బహిరంగ సభ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వ్యవస్థాపకులు మేకపోతుల నరేందర్ గౌడ్ గారు హాజరైనారు.ఈ యొక్క సభకు బీసీ నాయకులు మరియు బీసీ యువకులు మహిళలు దాదాపు 300 పైగా హాజరై ఈ యొక్క సభను విజయవంతం చేసినారు.రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల రద్దరు గౌడ్ మాట్లాడుతు బీసీల జనాభా దామాషా ప్రకారం వారికి రిజర్వేషన్లు కల్పించాలని మరియు ఎస్సీ ఎస్టీ లాగా బీసీలకు కూడా బీసీ అట్రాసిటీ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా దేశంలో బీసీల జనాభా అత్యధికంగా ఉందని మరి బీసీల పట్ల చిన్నచూపు చూడడం తగదని మరి బీసీలకు తగిన న్యాయం చేయాలని మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . భారత దేశంలో డీసెల జనాభా లెక్కించాలని వారి తమాషా ప్రకారం వాడ వాటా కల్పించాలని మరియు విద్య వైద్య ఉద్యోగ రంగాలలో 57 శాతం రిజర్వేషన్ ఉన్నటువంటి బీసీలకు తప్పకుండా న్యాయం జరిగే విధంగా వారి యొక్క రిజర్వేషన్ల ప్రకారం కేటాయించాలని మేకపోతుల నరేందర్ గౌడ్ తెలిపారు. అదేవిధంగా కేంద్రంలో ప్రత్యేక బిసి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా చట్టసభలలో బీసీలకు అన్ని పార్టీలు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నిజాంబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అబ్బ గోని అశోక్ గౌడ్ తెలంగాణ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు భీమనపల్లి విఠోబా , తెలంగాణ బి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిగాని బిక్షపతి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బొబ్బిలి నరసయ్య, బాల్కొండ నియోజకవర్గం అధ్యక్షులు దాసరి మూర్తి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ జగడం వెంకన్న, తెలంగాణ బి సంక్షేమ సంఘం యూత్ అధ్యక్షులు రాకేష్ యాదవ్, తెలంగాణ బి సంక్షేమ సంఘం సిరిసిల్ల టౌన్ అధ్యక్షులు సత్య నారాయణ, తెలంగాణ వేల్పూర్ మహిళా మండల అధ్యక్షురాలు ఇందర పుష్ప, ఏరుగట్ల మండల మహిళా అధ్యక్షురాలు నాగరాణి, బాల్కొండ నియోజకవర్గం ఉపాధ్యక్షులు రాజేంద్రప్రసాద్, ఆర్మూర్ మండల ఉపాధ్యక్షులు రాజేందర్, సాయిలు అర్జున్ కొప్పు రాజేందర్ మధు డాక్టర్ మురళి మరియు బీసీ నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు




