వికారాబాద్ రూరల్ ఏప్రిల్ 26 జనం సాక్షిజగత్ రక్షకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారి దీవెన లతో ప్రజలందరికీ క్షేమంగా ఉండాలని వికారాబాద్ జిల్లా, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు బుధవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు ధన్నారం* గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి* మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట చేసి 41 రోజులు అయిన సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని, శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ ముత్యం రెడ్డి పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్లు అనంత్ రెడ్డి మంజుల సుధాకర్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




