హైదరాబాద్: ముంబయి నుంచి విజయవాడకు దివంగత బాల్‌థాకరే ఆస్తికలను తీసుకెళుతున్న వాహనానికి హైదరాబాద్‌లోని మూసాపేట చౌరస్తాలో ఘన స్వాగతం లభించింది. కార్పొరేటర్ బాబురావు. పలువురు భాజపా నేతలు, హిందూ సమాజ ప్రతినిధులు స్వాగతం పలికి థాకరే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. హైదరాబాద్ వరకు రైలులో తీసుకొచ్చిన ధాకరే ఆస్తికలను హైదరాబాద్ నుంచి వాహనంలో విజయవాడ తరలించారు.




