కొత్తగూడ జూన్ 23 జనంసాక్షి:శుక్రవారం రోజున ఉదయం 9 గంటల కు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లోని పోగుళ్ల పల్లి గ్రామంలో 200 మంది గ్రామస్తులు,విధ్యార్ధులతో అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భముగా అవగాహణ మీటింగు,ర్యాలీ నిర్వహించడం జరిగింది.అనంతరం బాలవికాస జిల్లా కోఆర్డినేటర్ సంపత్ మాట్లాడుతూ జూన్ 23 వ తేదీని ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధికారిక అంతర్జాతీయ వితంతువుల దినోత్సవంగా 2010,డిసెంబర్ లో ప్రకటించి,లక్షలాది మంది వితంతువులు ఎదుర్కొంటున్న పేదరికం,అన్యాయాన్ని పరిష్కరించడానికి కేటాయించిన ప్రత్యేకమైన రోజు ఇది….ప్రపంచంలో 258 మిలియన్లు వితంతువులు ఉంటే కేవలం భారత దేశంలోనే 40మిలియన్లకు పైగా ఉన్నారని గ్లోబల్ విడోస్ రిపోర్ట్ 2015 ద్వారా తెలపడం జరిగిందని అన్నారు. అనంతరం జిల్లా జలవికాస కోఆర్డినేటర్ మధు మాట్లాడుతూ కోవిడ్ 19 మహమ్మారి కారణంగా వితంతుల సంఖ్య బాగా పెరిగింది.ప్రపంచం మొత్తంలో భారతదేశంలోనే అత్యధిక సంఖ్యలో వితంతువులున్నారు.దాని తర్వాత చైనా రెండవ స్థానంలో ఉంది.ఇంత పెద్ద సంఖ్యలో వితంతువులు నివసిస్తున్న మన దేశంలో సమాజం వారి పట్ల ఎలా వ్యవహరిస్తుందనేది చాలా ముఖ్యం…ఆలోచించాల్సిన విషయం అని అన్నారు.గ్రామంలో ఉన్న వితంతువులు మాట్లాడుతూ మూఢ ఆచారాల పేరుమీద తాము అనుభవిస్తున్న క్షోభ గురించి వివరించి కన్నీరు మున్నీరైనారు.ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వితంతువుంట్ల వివక్షత చూపవద్దని అన్నారు.ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన విధముగా “నూతన ఆవిష్కరణలు సాంకేతికతతో లింగ సమానత్వం “అను అంశం ఆధారంగా ఈ మీటింగు కొనసాగింది.అంతేకాక బాల వికాస వివిధ అభివృద్ధి పధకాలు నిర్వహిస్తున్న తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,కర్ణాటక,మహారాష్ట్,ఒరిస్సా రాష్ట్రాలలోని 31 జిల్లాలలోని సుమారు 50 గ్రామాలలో పలురకాల అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం సందర్భముగా వితంతువుల కు జరుగుతున్న వివక్షతను రూపుమాపుటకై అవగాహన మీటింగులు ఏర్పాటు చేసి,ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా వితంతులపై వివక్షత నిర్మూలపై ప్రతి ఒక్కరు పాటుపడాలని వారిచేత ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
బాల వికాస ఆధ్వర్యంలో అంతర్జాతీయ వితంతువుల దినోత్సవ వేడుకలు




