జనం సాక్షి జూన్ 23 భారత జాగృతి ఆధ్వర్యంలో హైద్రాబాద్ లోని సారస్వత పరిషత్త్ నందు ఏర్పాటు చేసిన తెలంగాణ సాహిత్య సభలో ముప్కాల్ ఏఎస్ఐ గా పనిచేస్తున్న తొగర్ల సురేష్ “పోలీస్ కవి”ని ఆయన చేస్తున్న రచనలకు సామాజిక కవిత సంకలనాలకు ప్రతిభను గుర్తించి భారత జాగృతి ఆధ్వర్యంలో భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత చేతులమీదుగా ఈ సన్మానాన్ని నిర్వహించారు తొగర్ల సురేష్ పోలీస్ కవి మాట్లాడుతూ ఇంతటి అద్భుతమైన అవకాశం నాకు రావడం ఆనందదాయకమని భవిష్యత్తులో మంచి రచనలు కొనసాగిస్తానని తెలియజేశాడు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రముఖులు ప్రజలు కవులు పాల్గొన్నారు
“భారత జాగృతి” ఆధ్వర్యంలో సన్మానం . ముప్కాల్




