బిఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శ్రీకాంత చారి వర్ధంతి వేడుకలు
మోత్కూరు డిసెంబర్ 3 జనంసాక్షి : తెలంగాణ మలిదశ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 13వ,వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మున్సిపాలిటీ కేంద్రంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమమే ఊపిరిగా తన ప్రాణాలను లాఠీ తూటాలకు సైతం లెక్కచేయకుండా బలమైన కొనసాగించిన సమయంలో తెలంగాణ వస్తే నీళ్లు ,నిధులు ఉద్యోగాలు వస్తాయని ఆదరగొట్టిన నాటి ప్రతిపక్ష నేత,నేటి ముఖ్యమంత్రి ఆ నీళ్లు ,నిధులు నిరుద్యోగులకు సరైన ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై శ్వేత పత్రం విడుదల చేసి వాటిని భర్తీ చేయాలన్నారు. రాష్ట్రం వచ్చి ఈ 8 ఏళ్ల లో ఉద్యోగాలు లేక నిరుత్సాహం పడుతున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నెలకు 3 వేల పెన్షన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొండగడప మాజీ సర్పంచ్ ఎర్రబెల్లి యాదయ్య, బి.ఆర్.ఎస్.ఎస్.జిల్లా నాయకులు నిమ్మల శ్రీనివాస్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు నిలిగొండ మత్స్య గిరి,నాయకులు గనగాని నాగేష్, కె రమేష్,వై ముత్తయ్య, వెంకన్న, సాయి,పవన్ తదితరులు పాల్గొన్నారు.




