ప్రపంచ వికలాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు
ముఖ్య అతిథిగా ఎస్ఐ శేఖర్ రెడ్డి
వీణవంక డిసెంబర్ 3 (జనం సాక్షి) వీణవంక మండల కేంద్రంలో శ్రీ సాయి ఆదర్శ సేవా సంఘం అధ్యక్షుడు పైడిమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీణవంక ఎస్ఐ శేఖర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు అనంతరం ఎస్ఐ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ వికలాంగులను దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆపదలో ఉన్న వికలాంగుల కోసం పోలీస్ శాఖ రక్షణ కల్పిస్తుందన్నారు వారికి ఏ ఆపాద వచ్చిన ముందు ఉంటామని ఫోన్ ద్వారా గాని స్వయంగా గాని మాకు ఫిర్యాదు చేయాలని వారన్నారు అనంతరం వికలాంగుల అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ వికలాంగుల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వికలాంగులకు రాజకీయపరంగా రిజర్వేషన్లు కల్పించాలని అదేవిధంగా ఆర్థికంగా ఆదుకోవడానికి వికలాంగుల బందు ప్రకటించాలని వారు కోరారు వికలాంగుల భవనానికి సహాయ సహకారాలు అందించిన వేణు బుచ్చిరాజం కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వెంకటాచలం కోశాధికారి గిరవెన సమ్మయ్య ,ఇందిరా శ్రీనివాస్ రాజు, మధునయ్య, అశోక్, కనకయ్య, వెంకటరెడ్డి, తిరుపతి, రాంరెడ్డి, కుమారస్వామి, ఓదెలు మండలంలోని ఆయా గ్రామాల వికలాంగులు తదితరులు పాల్గొన్నారు




