బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జులై 13. (జనంసాక్షి). పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. గురువారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు సబ్ స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మరోసారి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే రైతులు క్షమించబోరని అన్నారు. నిరసన కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అగ్గి రాములు. కౌన్సిలర్లు లింగంపల్లి సత్యనారాయణ, రెడ్డి నాయక్, నాయకులు ఎర్రవెల్లి రమణ రావు, కల్లూరి మధు, విడుగురాళ్ల బాలరాజు గౌడ్, శివరాత్రి లింగయ్య ,యాకూబ్, ఆలీ, తిరుపతి నాయక్ , కొంపెల్లి అశోక్ ,తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు