రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం – అన్ని సబ్ స్టేషన్ల వద్ద నిరసన చేసిన బిఆర్ఎస్ నాయకులు

వీర్నపల్లి, జూలై 13 (జనంసాక్షి): రాష్ట్రం ఏర్పాటు నుంచి రైతుల సంక్షేమం కోసం పాటు పడేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని మండలంలోని బిఆర్ఎస్ నాయకులు అన్నారు. గురువారం రోజున సబ్ స్టేషన్ల వద్ద రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అతని దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు కెసిఆర్ ప్రభుత్వం రైతుల కోసం రైతుబందు, రైతు భీమా పథకాలు అమలు చేస్తున్నరన్నారు. ఉచిత విద్యుత్ రైతులకు అందిస్తుంటే ఓర్వలేక రేవంత్ రెడ్డి రైతులకు అన్యాయం జరిగేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రైతులు, ప్రజల మద్దతుతో మరోసారి బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పి కో ఆప్షన్ సభ్యులు ఎండి చాంద్ పాషా, జడ్పీటిసి గుగులోతు కళావతి, ఎంపిపి మాలోతూ బుల, సెస్ డైరెక్టర్ మాడ్గుల మల్లేశం, బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు గుగులోతు సురేష్, ఎంపిటిసి నక్క రేన హన్మండ్లు, మండల నాయకులు తిప్పవరపు భాస్కర్, మండల యూత్ అధ్యక్షుడు సమల్ల దేవరాజు, ఉపాధ్యక్షుడు పొన్నం దేవరాజు, సర్పంచ్ లింగం, దినకర్, రజిత, గొర్రె కరుణ రంజిత్ పలువురు మండల నాయకులు పాల్గొన్నారు.

తాజావార్తలు