.
యాదాద్రి భువనగిరి జిల్లా/(పజదేశం):–25 ఏప్రిల్ మంగళవారంభువనగిరి మండలంలోని తాజ్ పూర్ గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు భువనగిరి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి పిలుపుమేరకు బి ఆర్ ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు ర్యాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిఅనంతరం జెండా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ బొమ్మరపు సురేష్ పాల్గొన్నారు.
అనంతరం పలువురు మాట్లాడుతూ బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు .బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లాలని ,ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను వెనక్కి తిప్పి కొట్టాలని, ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ,వివిధ విభాగాల అధ్యక్షులు ,కార్యదర్శులు పాల్గొన్నారు.




