Thursday, 5 November 2026

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం

 

మోత్కూరు మార్చి 11 జనంసాక్షి : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వాఖ్యలకు నిరసనగా తుంగతుర్తి శాసన సభ్యుడు
గాదరి కిశోర్ కుమార్ ఆదేశానుసారం మున్సిపాలిటీ కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షులు &రాష్ట్ర అయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామక్రిష్ణ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రి – మేఘారెడ్డి,
మండల పార్టీ అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్,
అడ్డగూడురు మండల అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి,వైస్ చైర్మన్ బొల్లేపల్లీ వెంకటయ్య,వైస్ ఎంపీపీ బుశిపాక లక్ష్మి, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, గొరుపల్లీ సంతోష్ రెడ్డి, జిల్లా ఎస్సీ&ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ దాసరి తిరుమలేష్
మండల, మున్సిపల్ మహిళ అధ్యక్షురాల్లు మల్లం అనిత,కట్ట ఇంద్రజ్యోతి, నాయకురాలు దబ్బెటి శైలజ,కౌన్సిలర్లు డబ్బెటి విజయ – రమేష్, మలిపెద్ది రజిత,కురెళ్ళ కుమార స్వామి,కో ఆప్షన్ ఎండీ సహిన్ సుల్తానా – మజీద్,నాయకురాలు మోగుల్ల అనురాధ, పైళ్ళ సాత్విక,అన్నెపు మంగమ్మ, పద్మ,సోమక్క,వర్రే రాములు, మోరిగాల వెంకన్న,మెంట నగేష్,కొంగరి మల్లేష్, కూరెళ్ళ రమేష్,దాసరి నరేష్,కందుకూరి యాదగిరి, జిట్ట సాయి కుమార్,దాసరి నవీన్ కుమార్,వడ్డేపల్లి నగేష్,రాజు,నరేష్ తదితరులు పాల్గొన్నారు.