: శామీర్ పేట్, జనంసాక్షి :
గురువారం తూంకుంట లో ని మొగుళ్ళ వెంకట్ రెడ్డి గార్డెన్ లో మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ , మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జి చామకూర మహేందర్ రెడ్డి పెళ్లి విందుకు హాజరై వధూవరులు అనూష శ్రీకాంత్ గౌడ్ లను ఆశీర్వదించారు. కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ మిత్రులు సత్యనారాయణ గౌడ్ కుమారుడు శ్రీకాంత్ గౌడ్ పెళ్లి కి హాజరై వధూవరులు అనూష, శ్రీకాంత్ గౌడ్ లను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ వీరిని ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఉండాలని ఆశిస్సులు అందజేశారు. అఫ్జల్ ఖాన్ తో పాటు మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జి చామకూర మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు విలాసాగరం సుదర్శన్, ఎంపిటిసి డపు సాయి బాబా, సురేష్ వంగ వెంకట్ రెడ్డి, రమణా రెడ్డి,చాంద్ పాషా,మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్,మహ్మద్ ఇర్ఫాన్, పి నర్సింహ రెడ్డి,జనార్థన్ చారి, దూడల నరేష్ గౌడ్, వివిధ మండలాల నాయకులు, సర్పంచ్ లు , ఎంపిటిసి లు, వార్డు సభ్యులు , మున్సిపల్ కౌన్సిలర్ లు, తదితరులు పాల్గొన్నారు.
9ఎస్పీటీ -1: వివాహ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు




