Wednesday, 4 November 2026

బిఎమ్ఎస్ ధర్నా

 

 

 

 

శుక్రవారం రోజున శ్రీరాంపూర్ సిహెచ్పి నందు సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ ఆధ్వర్యంలో ఈ అండ్ ఎం డివై జిఎం కార్యాలయం ముందు నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పేరం రమేష్ హాజరైనారు .సిహెచ్ పి కార్మిక సమస్యల పరిష్కారం పరిష్కరించాలని 17 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇన్చార్జి సిహెచ్ పి షకిల్ గారికి ఇవ్వడం జరిగింది .వారు మాట్లాడుతూ నాకు ఇచ్చిన అటువంటి మేమో రండమును పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్తానని ఈ క్రింద పొందుపరిచిన 17 అంశాలను సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని తెలపడం జరిగింది.అందులో ప్రధానమైన డిమాండ్లు ఇలా ఉన్నాయి.
1).నూతనంగా ఏర్పాటు చేసిన ప్లాంటులో సేఫ్టీ మరియు ఎన్విరాన్మెంటల్ నియమ నిబంధనలు పాటించాలి.
2) డస్ట్ పొల్యూషన్ తగ్గిస్తూ డస్ట్ సపరేషన్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది
3) గ్రీన్ మెష్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది
4) ట్రేడ్స్ మేన్స్ కు ఆన్ డ్యూటీ రూమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.
5) లారీ ముఖ దాం రూమును పర్మినెంట్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.
6) ఆర్వో ప్లాంట్ నుండి ప్రతి వర్క్ మెన్ పాయింట్ వరకు మంచినీటి సౌకర్యాన్ని అందించాలని డిమాండ్ చేయడం జరిగింది
7) సి హెచ్ పి లో రెండు వే బ్రిడ్జిలు నడిపిస్తూ క్లర్కు పని భారం తగ్గించాలని మరియు వేబ్రిడ్జి నందు ఏసీ సౌకర్యం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.
8) శ్రీరాంపూర్ ఏరియాలో లాంగ్ స్టాండింగ్ లో పనిచేస్తున్న డివై జిఎమ్ వెంకటేశ్వర్ రావ్ ను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.
9) ఎం వి డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తూ ట్రక్కులను రిపేరు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.
10) ఓల్డ్ మెరిట్ నుండి గత 30 సంవత్సరాలుగా ఉన్న దారిని మూసి వేసి కార్మికులను ఇబ్బంది పెట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ వెంటనే దారిని కొనసాగించి కార్మికులకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేయడం జరిగింది.
11). క్యాంటీన్ సౌకర్యాన్ని మెరుగుపరచాలని డిమాండ్ చేయడం జరిగింది.
12) సి హెచ్ పి లో కార్మిక వేధింపులు మానుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది.
13) శాంపిలింగ్ కార్మికులకు ప్రతి లోడింగ్ సమయంలో ఒక గంట OT ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది.
14). మాన్వేలో వాకిటాకిలను తీసివేసి ల్యాంపురం నందు బద్రపరిచి షిఫ్ట్ సమయంలో జనరల్ మజ్దూర్ ను కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది.
15) నూతనంగా ఏర్పాటు చేస్తున్న డ్రెస్సింగ్ రూమ్ లను వెంటనే కార్మికులకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేయడం జరిగింది.
16) నూతనంగా ఏర్పడిన సి హెచ్ పి లో ఐడి నామ్స్ ప్రకారం కార్మికులను పెంచాలని డిమాండ్ చేయడం జరిగింది.
17) ఎండాకాలం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కార్మికులకు మజ్జిగ సప్లై చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో లో ,కాదాసీ భీమయ్య సెంట్రల్ కమిటీ సభ్యులు ,రాకేష్ డివిజన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జోగుల ప్రభాకర్ ,ఎం సురేష్ ఏరియా కోశాధికారి ,పంచర్ల నరేష్ డివిజన్ కార్యదర్శి తవటం భాస్కర్ డివిజన్ కమిటీ నాయకులు,సిహెచ్ పి లో పనిచేస్తున్న కార్మికులందరూ పాల్గొనడం జరిగింది.